28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అంగరంగ వైభవంగ ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

  • 6వ రోజు యాగం మహా పూర్ణాహుతి, చక్ర స్నానం, శ్రీపుష్ప యాగం

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఇందూరు తిరుమల 11వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు యాగశాలలో మహా పూర్ణాహుతి అనంతరం భక్తులను ఉద్ధేశించి దేవనాథ జియర్ స్వామి, ఆచార్య గంగోత్రి రామానుజదాస్ స్వామి ప్రవచనాలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు “మహా పూర్ణాహుతి” అనంతరం స్వామి వారికి చక్ర స్నానం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ పుష్కరిణిలో స్వామివారికి చక్ర స్నాన కార్యక్రమాన్ని దేవనాథ జియర్ స్వామి, గంగోత్రి స్వామి వేద పండితులు, అర్చక స్వాములు నిర్వహించారు. సాయంత్రం వేలాది పువ్వులతో శ్రీపుష్ప యాగం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం దేవనాథ జియర్ స్వామి ఆచార్య గంగోత్రి రామానుజ దాస్ స్వామి ప్రవచించారు. మనుషులు సదా భగవంతునికి  కృతజ్ఞాతపూర్వకంగా ఉండాలని అన్నారు. భగవంతుడు లోక కార్యం మనుషుల ద్వారా చేస్తారు అని అన్నారు. భగవంతుడి కృప వల్లనే మనిషి గొప్పగా ఎదుగుతాడు అని అన్నారు. భగవంతుడు లోక కార్యానికి మనుషులను ఎంచుకుంటాడు అని

The grand Indore Tirumala Brahmotsavams

అన్నారు. భగవంతుడు మనల్ని ఎంచుకునేందుకు అర్హత సాధించాలి అని అన్నారు… మనిషి లోపల భూత దయ ప్రకృతి పట్ల ప్రేమ దేశ భక్తి ఉండాలి అన్నారు. భగవంతుడు అన్ని కార్యాలను మనుషుల ద్వారానే చేస్తారు కాబట్టి ఆ మనిషి మనమే ఎందుకు కావద్దు అనే తపన ఉండాలి అని అన్నారు. కలి యుగంలో హరి నామమే మోక్ష మార్గం కాబట్టి ప్రతి క్షణం హరి నామం జపిస్తూ ఉండాలి అని అన్నారు. మనిషి తాను మోక్ష మార్గాన్ని అనుసరిస్తు సాటి మనిషికి కూడా మోక్ష మార్గాన్ని చూపెట్టాలి అని అన్నారు. “ఇందూరు తిరుమల ఇలలో మరో వైకుంఠంగా” వెల్గొనన్నుది అని అన్నారు. చక్ర స్నానం, పుష్పయాగం కార్యక్రమాల్లో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రముఖ నిర్మాత దేవనాథ జియర్ స్వామి, గంగోత్రి రామానుజ జియర్ స్వామి, ఆలయ ధర్మకర్తలు నర్సింహ్మా రెడ్డి దంపతులు, దిల్ రాజు దంపతులు, శిరీష్ రెడ్డి దంపతులు, విజయసింహా రెడ్డి దంపతులు, హరీష్ దంపతులు, సుధర్షన్ రెడ్డి దంపతులు, గంగాధర్, నర్సారెడ్డి, నరాల సుధాకర్, ప్రసాద్, రమేష్ భాస్కర్, పృథ్వీ, నరేందర్, రాజేశ్వర్, సాయిలు, గంగా రెడ్డి, సురేష్,రవి, భూం రెడ్డి, యాజ్ఞాచార్యులు శిఖామణి శర్మ, సత్యన్నారాయణ ఆచార్యులు, శ్రీకరాచార్యులు రోహిత్ కుమారాచార్యా విజయ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

The grand Indore Tirumala Brahmotsavams

More articles

Latest article