25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పగలే వెన్నెల…

Must read

📰 Generate e-Paper Clip

  • పట్టించుకోని అధికారులు..

 

రుద్రూర్, బతుకమ్మ : విద్యుత్‌ అధికారులు పర్యవేక్షణలోపం కారణంగా పట్టపగలే వీధి దీపాలు వెలుగుతూ వారి నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. రుద్రూర్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ వెనుకాల గల ట్రాన్స్ ఫార్మర్ వద్ద గల విద్యుత్ స్థంబాలకు, పలు కాలనీలో విద్యుత్ స్థంబాలకు సమయం మధ్యాహ్నం 12:40 అవుతున్న కూడా వీధి దీపాలు వెలుగుతుండడంతో పలువురు నివ్వేర పోతున్నారు. వీధి దీపాల నిర్వహణలో ఉన్న సమస్యలను విద్యుత్‌ సిబ్బంది పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. మండలంలో చాలా గ్రామాల్లో వీధి దీపాలు నిరంతరం వెలుగుతూనే ఉన్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వెలుగుతుండడంతో వందలాది యూనిట్లు విద్యుత్‌ వృథా అవుతున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ ను పొదుపు చేయాలని పలువురు కోరుతున్నారు.

More articles

Latest article