25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పదో తరగతి పరీక్షా కేంద్రాలు పరిశీలించిన పోలీస్ కమీషనర్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పదవ తరగతి పరీక్ష కేంద్రాలను శనివారం నిజామాబాద్ పోలీస్  కమీషనర్  పి. సాయి చైతన్య తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ల పరీక్ష  కేంద్రాలు సందర్శించి పరీక్షా సరళి పరిశీలించారు. పరీక్షలు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ కూడా లోపాలు ఉండకుండా పర్యవేక్షణ చేయాలని అన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ -2023 అమలులో ఉంటుందని, అన్ని పరీక్ష కేంద్రాలవద్ద ఎలాంటి అవాంచనీయా సంఘటనలు జరుగకుండా జిల్లా పోలీస్ శాఖ  పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. పరీక్షా సమయంలో విద్యార్థులకు

Police Commissioner inspects 10th class examination centers

ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను సమర్థంగా నియంత్రించాలి అని పోలీసు అధికారులను ఆదేశించారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని, ఎవ్వరూ కూడా అవకతవకలకు పాల్పడవద్దని ప్రతీ ఒక్కరు కష్టపడి చదివి టైమ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ పరీక్షలు రాయాలని కోరారు. విద్యార్థులు నిర్నీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు రావాలని అన్నారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు అన్నారు. అలాగే స్పార్ట్ వాల్వేషన్ జరుగుతున్న నిర్మల హృదయ స్కూల్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్బంగా టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, బందోబస్తు సిబ్బంది ఉన్నారు.

Police Commissioner inspects 10th class examination centers

More articles

Latest article