- తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ సంక్షేమాన్ని అభివృద్ధిని ఏకకాలంలో ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఒకపక్క రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకు వెళుతూ ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఐటీ, వ్యవసాయ రంగం కోసం అత్యధిక నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా సంక్షేమం విషయంలో రైతు భరోసా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధి కొరకు నిధులు కేటాయించడం, స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువకులకు వృత్తి నైపుణ్యం అందించి స్వయం ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఓరవడి సృష్టించిందన్నారు. అభివృద్ధి సంక్షేమం సమనంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలిపారు. గతంలో 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ విస్మరించిన అంశాలన్నింటికీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కొరకు నిధులు కేటాయించిందన్నారు. అన్ని వర్గాలు ఆదరించే విధంగా ఎస్సీ సంక్షేమానికి 40 వేల కోట్ల రూపాయలు, ఎస్టి సంక్షేమానికి 17వేల కోట్ల రూపాయలు, మైనార్టీ సంక్షేమానికి 3500 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో భట్టి విక్రమార్క అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టారని తెలిపారు. కచ్చితంగా తెలంగాణ బడ్జెట్ దేశంలోని నంబర్ వన్ నిలుస్తుందని తెలిపారు.
