ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలం ఎంపిడివో కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో, ఉపాధి హామీ సిబ్బంది తో ఇంచార్జి ఎంపిడివో ప్రకాష్ సమీక్ష కార్యక్రమం నిర్వహించారు.గ్రామాలలో ఉపాధి హామీ పనులు,ఫార్మేషన్ రోడ్డు,ఇంకుడు గుంతలు,ఫామ్ పాండ్స్,నిర్మాణం వేగవంతం చేయాలనీ కోరారు.ఉపాధి కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని సూచించారు. అలాగే కూలీలకు వేసవిని దృష్టిలో ఉంచుకుని టెంట్లు, త్రాగునీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఎంపివో వినోద్,టి ఏ జయశ్రీ,ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
