బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఐఎఫ్పి ద్వారా అమెరికా అంతరిక్ష వ్యోమగాములు( సునీత విలియమ్స్, విల్మోర్ ) భూమిపై చేరుకున్న సందర్భంగా వారి ప్రయాణ వివరాలను చూపించి వివరించడం జరిగినది. విద్యార్థుల సందేహాలను సైన్సు ఉపాధ్యాయులు మహేష్ కుమార్, మమత, నరసింహస్వామి నివృత్తి చేసినారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు సైన్స్ పై మక్కువ పెరిగి వివిధ ప్రయోగాలు చేయడానికి సహకరిస్తుందని ప్రధానోపాధ్యాయులు పల్లెపాటి వేణుగోపాలరావు తెలియజేశారు. కార్యక్రమం చూపించి, విద్యార్థులకు సైన్స్ పై అభిరుచి పెంచుతున్నందుకు సైన్స్ ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేసినారు.
