శాసనసభలో ప్రవేశ పెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
వెబ్ న్యూస్, బతుకమ్మ : 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,04, 965 కోట్లతో బడ్జెట్ ను శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం ప్రవేశపెట్టారు. అందులో రెవెన్యూ వ్యయం: 2,26,982, మూల ధన వ్యయం: 36,504 కోట్లు. ఆర్థిక మంత్రిగా మూడో సారి 72 పేజీల బడ్జెట్ ప్రసంగాన్ని భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తొలిఏడాదిలో సవాళ్లను అధిగమించామన్నారు. దశాబ్ధకాలంలో పాలన వ్యవస్థలు నిర్వీర్యమయ్యాన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పని చేస్తున్నామన్నారు. సంక్షేమం, అభి వృద్ధి ఈప్రభుత్వానికి జోడు గుర్రాలు అన్నారు. నిరాధార ఆరోపణలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 200 మి.డా. ఉందని, భవిష్యత్తులో ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళిక చేపట్టామన్నారు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు. తెలంగాణ తలస రి ఆదాయం రూ.1.74.172 కోట్లు అని, గతేడాది 9.6 శాతం వృద్ధి సాధించామన్నారు.

