24.1 C
Hyderabad
Monday, August 3, 2026

సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యకేసులో కీలక పరిణామం

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న హరిబాబు ఈకేసులో A8 గా ఉన్నారు. ఫిబ్రవరి 20 నుంచి నిందితుడు హరిబాబు పరారీలో ఉన్నారు.  క్రెడిట్ కార్డు వినియోగం ఆధారంగా అతడ్ని పోలీసులు పట్టుకున్నారు. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న సమయంలోనే హరిబాబును ఢిల్లీలో పోలీసులు అరెస్టు చేశారు. హరిబాబును కోర్టులో హాజరుపర్చి పోలీసులు రిమాండ్ కు తరలించారు. హరిబాబు అరెస్ట్ తో ఈ హత్యకు సంబంధించిన మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. రాజలింగమూర్తి హత్య తెలంగాణలో సంచలన రేపిన విషయం తెలిసిందే.

More articles

Latest article