24.1 C
Hyderabad
Monday, August 3, 2026

పోలీస్ స్టేషన్లో చిల్డ్రన్స్ పార్క్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద :  పోలీస్ స్టేషన్లో చిల్డ్రన్ పార్క్  ఏమిటీ అనుకుంటున్నారా..? అవును నిజమే..! బిచ్కుంద పోలీస్స్టేషన్లో సోమవారం ఎస్పీ రాజేష్ చంద్ర చిల్డ్రన్ పార్క్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు ఆడుకునేందుకు ఈ పార్క్ ఉపయోగపడుతుందన్నారు. పార్క్ ఏర్పాటు చేయించిన బిచ్కుంద సీఐ జగడం నరేశ్ ను  అభినందించారు. అనంతరం బిచ్కుంద, మద్నూర్, జుక్కల్ పోలీస్ స్టేషన్లను సందర్శించారు. కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పోలీసు సిబ్బందికి పలు సలహాలు, సూచనలు అందించారు. జిల్లాకు సరిహద్దులో మహారాష్ట్ర ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ, బిచ్కుంద సీఐ జగడం నరేష్, ఎస్సై సుధాకర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

 

Children's Park at the Police Station

More articles

Latest article