కరాటే పోటీల్లో కేజీబీపీ విద్యార్థినిలకు 17 బంగారు పథకాలు

0 1,287

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : యూనివర్సల్ 369 షోటోకన్ కరాటే అకాడమీ అసోసియేషన్ మేడ్చల్ సుమంగళి గార్డెన్ లో ఆదివారం నిర్వహించిన ఆల్ ఇండియా ఓపెన్ కరాటే పోటీల్లో మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలకు చెందిన 17 మంది విద్యార్థినిలు పాల్గొని బంగారు పతకాలు సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ గీత తెలిపారు.  కరాటే పోటీలో 17 బంగారు పథకాలతో పాటు ఛాంపియన్ షిప్ ట్రోఫీ సాధించారు. కరాటే పోటీలో ప్రతిభ కనబరచి బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపాల్ గీత, తోపాటు పాఠశాల సిబ్బంది అభినందించారు.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయురాలు శోభ, కరాటే కోచ్ మంగలి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.