27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ సేవలు అభినందనీయం

Must read

📰 Generate e-Paper Clip

  •  బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత..

 

రుద్రూర్, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ సేవలు అభినందనీయమని పలువురు    హర్షం వ్యక్తం చేస్తున్నారు. రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామంలో బీజేపీ బూత్ ప్రధాన కార్యదర్శి దావోజీ నవీన్ కి ఇంటి దగ్గర పని చేస్తుండగా కింద పడి కాలు వేలు విరగడం  జరిగింది. రుద్రూర్ మండల కమిటీ ద్వారా విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ సోమవారం బీజేపీ కార్యకర్త ఇంటికి వెళ్లి తనకు దైర్యం చెప్పి కార్యకర్తకు అండగా నేను ఉంటానని భరోసా నిచ్చి ఆసుపత్రి ఖర్చులకు  5,000 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. అదేవిధంగా  రుద్రూర్ గ్రామంలో బీజేపీ కార్యకర్త ఏముల సాయికి ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ వారి ఇంటికి వెళ్లి తనకు దైర్యం చెప్పి కార్యకర్తకు అండగా నేను ఉంటానని భరోసా నిచ్చి టాబ్లెట్స్ కొరకు  5,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. ప్రతి నెల కోసం కోనేరు శశాంక్ ట్రస్ట్ ద్వారా టాబ్లెట్స్ ఇప్పిస్తానని చెప్పారు. అలాగే అక్బర్ నగర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన వడ్ల రవి అనే వ్యక్తి అకాలంగా మరణించడం జరిగింది. రుద్రూర్ మండల కమిటీ ద్వారా విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ వారి ఇంటికి వెళ్లి కుటుంబీకులకు దైర్యం చెప్పి వారికీ అండగా నేను ఉంటానని భరోసా నిచ్చి వారి కుటుంబానికి ఒకనెలకి సరిపడా నిత్యావసర సరుకులను, ఆర్ధిక సహాయం అందజేశారు. కోనేరు శశాంక్ ట్రస్ట్ ద్వారా వారి పిల్లల చదువుకి కావలిసిన సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఏముల గజేందర్, మండల సీనియర్ నాయకులు రామ్ రాజ్, ప్రధాన కార్యదర్శి సాయినాథ్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు శివప్రసాద్, వినోద్ కుమార్, కేవీడీ సాయిలు, సాయికుమార్, కృష్ణం రాజు, తేజ, బూత్ అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

NRI Koneru Shashank's services are commendable

More articles

Latest article