ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నిజామాబాద్, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి కలలో కూడా కేసీఆర్ ను కలవరిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రంజాన్ తోఫాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ కు ఉదయం నుంచి రాత్రి వరకు కేసీఆర్ జపం చేస్తున్నాడన్నారు. రోజు రోజుకు కేసీఆర్ బలం పెరుగుతుందని తెలిపారు. సీఎం రేవంత్ అబద్దాలు మాట్లాడుతే ఊరుకోనేది లేదని హెచ్చరించారు. రైతులకు రైతు బందు ఇవ్వడు, రైతు భరోసా లేదు, సాగు నీరు ఇవ్వకుండా సోది ముచ్చట్లు చెబుతున్నాడని విమర్శించారు. స్టేట్ ఫుచర్ రేవంత్ కాదని.. తెలంగాణ హిస్టరీ కేసీఆర్.. తెలంగాణ ఫుచర్ కేసీఆర్ అని తెలిపారు. బీఆర్ఎస్ అంటేనే మత సామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు, ఉద్యోగాలు ఇవ్వకుండా ఉట్టి మాటలతో టైం పాస్ చేస్తున్నారని అన్నారు. గౌరవం అనేది మన ప్రవర్తనను బట్టి ఉంటుందన్నారు. కేసీఆర్ మాట్లాడితే జనం టీవీల ముందు క్యూ కడతారని, రేవంత్ మాట్లాడితే జనం టివి లు మ్యూట్ చేస్తున్నారని తెలిపారు. కెసిఆర్ తో రేవంత్ ఎక్కడా సరిపోరని భవిష్యత్తు మళ్ళీ కేసీఆర్ దే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్, గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే షకీల్ భార్య అయేషా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

