27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

‘అగ్నిపథ్’ దరఖాస్తుల ఆహ్వానం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: అగ్నిపథ్ 2025 – 26 సంవత్సరానికి అగ్నివీర్ నియామకానికి భారత సైన్యం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు అవివాహితులై ఉండి ఏప్రిల్ 10వ తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్తులు ఇవే..
అగ్ని వీర్ జనరల్, అగ్ని వీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్, టెక్నికల్ ట్రేడ్ మెన్ (పదో తరగతి పాస్), అగ్ని వీర్ ట్రేడ్ మెన్ (ఎనిమిద తరగతి పాస్) కేటగిరీలలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు వారి అర్హత ఆధారంగా ఏవైనా రెండు కేటగిరీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సంబంధిత వెబ్ సైట్ ను లేదా సికింద్రాబాద్ లోని ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ (040 27740059)ను సంప్రదించాల్సి ఉంటుంది.

More articles

Latest article