వెబ్ న్యూస్, బతుకమ్మ : రాబిన్‌హుడ్ మూవీ టీం విజయవాడలోని ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించింది. నటుడు నితిన్, దర్శకుడు వెంకీ కుడుములతో పాటు ఇతర ముఖ్య తారాగణం ఆదివారం ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఈమూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నాడు. భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తుంది. దీంతో ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను మార్చి 28న మేకర్స్ విడుదల చేయనున్నారు.
