29 C
Hyderabad
Monday, August 3, 2026

హిందూవులు బలహీనపడితే…. దేశం బలహీనపడే అవకాశం ఉంది

Must read

📰 Generate e-Paper Clip

. . . హిందూ ధర్మ జాగరణ ప్రముఖ్ అమర లింగన్న

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

దేశంలో ఇప్పటికే చాలా ప్రాంతాలలో హిందువులు మతం మారుతున్నారని, హిందూవులు బలహీనపడితే దేశం బలహీనపడే అవకాశం ఉందని  తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల హిందూ ధర్మ జాగరణ ప్రముఖ్ అమర లింగన్న అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతవసంతాల ఉత్సవాలను పురస్కరించుకుని ఇందూర్  నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నగర ఆర్ఎస్ఎస్ శాఖల సంగమం జరిగింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ ధర్మ జాగరణ ప్రముఖ్ అమర లింగన్న హజరై మాట్లాడుతూ… ఆర్ఎస్ఎస్ అంటే క్రమశిక్షణకు మారుపేరు అన్నారు. సంఘ్ గురించి తెలుసుకోవాలంటే దాన్ని చూస్తే సరిపోదని , దీనిపై అవగాహన కలిగి ఉండాలని తల్లిదండ్రులు తమ పిల్లలకు హిందూ సంప్రదాయాలను ఎప్పటికప్పుడు గుర్తు చేయాలని అన్నారు. హిందూవులు ఆర్ఎస్ఎస్ పై విమర్శలు చేయడం బాధాకరం అన్నారు. హిందూ ధర్మం శ్రేష్ఠమైనది హిందువులు సంఘటితంగా ఉండాలి అన్నారు. లవ్ జిహాద్ లాంటి వాటిని ఎదుర్కోవడానికి మన కుటుంబాలను సమాయాత్తం చేయాలి అని తెలిపారు.. మత మార్పిడిలను నిరోధించాలని , జనాభా అసమతుల్యం దేశానికి పెను ప్రమాదమని హిందువులు జాగరూకులై ప్రతినిత్యం సంఘ శాఖలో భారతమాతను స్మరిస్తూ, దేశం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.

If Hindus become weak... then the country is likely to become weak.

 

56 శాఖలతో సంగమం..

ఆర్ఎస్ఎస్ శత వసంత్సోవాల సందర్భంగా నగరంలో 56 శాఖలో సంగమం జరిగింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొని శారీరక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విభాగ సహకార్యవహ వరగంటి శ్రీనివాస్, జిల్లా కార్యవాహ దస్తగిరి, నగర కార్యవాహ ఆరుగుల సత్యం, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె  గంగారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్, బిజెపి నాయకులు, కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు సుమిత్, వెంకటేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article