27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పీడీఎస్ రైస్ గోదాంలపై టాస్క్ ఫోర్స్ దాడులు

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : బోధన్ టౌన్ పోలీస్ టౌన్ పరిధిలోని పీడీఎస్ రైస్ గోదాములపై టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో శనివారం  దాడులు నిర్వహించినట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ అంజయ్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్  సాయి చైతన్య, టాస్క్ ఫోర్స్ ఏసీపీ నాగేంద్ర చారి ఆదేశాల మేరకు మూడు గోదాములపై దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో 8టన్నుల పీడీఎస్ రైస్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీని విలువ సుమారు రూ.2.80లక్షల వరకు ఉంటుందని అన్నారు. అక్రమంగా  పీడీఎస్ బియ్యాన్ని నిల్వ ఉంచిన ముగ్గురు గోదాం నిర్వాహకులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తదుపతి చర్యల నిమిత్తం బోధన్ టౌన్ ఎస్ఎచ్ఓకు అప్పగించినట్లు తెలిపారు.

More articles

Latest article