భీమ్ గల్, బతుకమ్మ : రేర్ మిక్స్డ్ ఫీనోటైప్ అక్యూట్ లూకీమియా వ్యాధితో చికిత్స పొందుతున్న ముస్కు నిఖిలేష్ అనే బాలునికి రెడ్డి ఐక్యవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, అరుణ ప్రభ ఎం.డి నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి తనవంతు ఆర్ధిక సహాయాన్ని అందించి తన ఉదారతను చాటుకున్నారు. శుక్రవారం ఐటెక్ సిటీలోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాలున్ని పరామర్శించిన ఆయన రూ. 10వేల నగదు ఆర్ధిక సహాయాన్ని బాలుని తల్లిదండ్రులకు అందించారు. ఆయన వెంట అరుణ ప్రభ డైలీ న్యూస్ ఎడిటర్ గుర్రం పాపిరెడ్డి ఉన్నారు.
నిఖిలేష్ చికిత్స కోసం కరుణాకర్ రెడ్డి ఆర్ధిక సహాయం


