నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని వన్ టౌన్ పరిధిలో పేకాట స్థావరంపై దాడి చేసి 10మందిని అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ అంజయ్య తెలిపారు. నగరంలోని వీక్లీ బజార్, ముదిరాజ్ గల్లీలోని ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, స్పెషల్ పార్టీ ఆధ్వర్యంలో దాడి చేశారన్నారు. ఈ దాడిలో 10మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.66,410నగదు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం వన్ టౌన్ ఎస్ఎచ్ఓకు అప్పగించినట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా సాయి చైతన్య బాధ్యతలు తీసుకున్న తరువాత పోలీసులు తమ దూకుడు పెంచారు. గత రెండు రోజుల క్రితం కమ్మర్ పల్లిలో అక్రమంగా పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్నా ముఠాను అరెస్ట్ చేశారు. తాజాగా నగరంలో గురువారం పేకాట స్థావరంపై దాడి చేసి 10మందిని అరెస్ట్ చేశారు.
