27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉన్నత లక్ష్యం నిర్దేశించుకోని చదవాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: విద్యార్థులు మొదటి నుంచి ఒక ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకొని లక్ష్యం చేరుకోవడానికి ప్రతి రోజు ప్రణాళిక ప్రకారం సమయం కేటాయించి లక్ష సాధన కోసం శ్రమించి జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడాలని మోటివేషనల్ స్పీకర్ తుమ్మల మహేష్ కుమార్ విద్యార్థులకు ప్రేరేపణ కలిగించారు. మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామంలో గల జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం నిర్వహించిన మోటివేషనల్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయము కావున చదువుతోపాటు, ఆరోగ్య విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు చరవాణి కి అంకితమై సమయం వృధా చేయకుండా సమయం సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఏకాగ్రతతో చదివి 100% ఫలితాలు సాధించాలని విద్యార్థులకు ప్రేరేపణ కలిగించారు. అనంతరం పాఠశాల సిబ్బంది ఆయనను శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article