24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎన్నికల మేనిఫెస్టో హామీలు అమలు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎస్టీయూ అధ్యక్షులు ధర్మేందర్

 

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న ఉపాధ్యాయ, విద్యారంగ హామీలు అమలు చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) అధ్యక్షులు ధర్మేందర్ అన్నారు. ఉపాధ్యాయ సమస్యల ను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ఈ కుబేర్ లో పెండింగ్ లో ఉన్న  జి. పి.ఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్, సరెండర్ లీవ్, రిటైర్మెంట్  బెనిఫిట్స్ తదితర బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని కోరారు. సర్వీస్ రూల్స్‌ సాధించి, ఎంఈఓ, డిప్యూటీ ఈవో, డైట్‌ మరియు జూనియర్‌ లెక్చరర్‌ పదోన్నతులు ఇప్పించుటకు రాష్ట్ర సంఘం కృషి చేస్తుందని అన్నారు.  జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ 317 జీవో ద్వారా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను త్వరితగతిన వారి సొంత జిల్లాలకు బదిలీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.  ఆశ్రమ, కెజిబివి పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీ ఉపాధ్యాయులకు అన్ని రకాల సెలవులతో పాటు, మినిమం టైం స్కేల్‌ మంజూరు చేయాలని కోరారు. పీఆర్సీ గడువు ముగిసి ఏడాదిన్నర గడిచిందని, వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగులో ఉన్న డిఏలు, సిపియస్‌ రద్దు కోసం  ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, పరిష్కరించడానికి రాష్ట్ర సంఘం కృషి చేస్తుందన్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో భాషా పండితుల పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్లుగా ఉన్నతీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్,రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్,జిల్లా ఆర్థిక కార్యదర్శి అఫ్జల్ బెగ్,జిల్లా కార్యవర్గ సభ్యులు మహేశ్వర్, యాదగిరి, సురేందర్, కాంతరావు, పవన్ కుమార్,సాయిబాబా,రత్నాకర్,గంగా కిషన్,రవీందర్ గౌడ్ మల్లయ్య, సన ఉద్దీన్,హరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article