30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

నర్సరీని పరిశీలించిన మండల ప్రత్యేక అధికారి

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం గ్రామ నర్సరీని మండల ప్రత్యేక అధికారి ప్రభాకర్ బుధవారం పరిశీలించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల వివరాలు పంచాయతీ కార్యదర్శి సిద్ధిరములును అడిగి తెలుసుకున్నారు. జామ, మామిడి, బాదాం కదంబ, కానుగ చెట్లు నాటినట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు. వేసవి కాలంలో మొక్కలను ఎండిపోకుండా కాపాడాలని పంచాయతీ కార్యదర్శి కి సూచించారు. ఈ కార్యక్రమం లో ఇంచార్జి ఎంపిడివో ప్రకాష్, ఎపివో వినోద్, పంచాయతీ కార్యదర్శి సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article