24 C
Hyderabad
Sunday, August 2, 2026

సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ: మండలంలోని అవల్ గావ్ గ్రామంలో మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన  పది లక్షల తో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. సిసి రోడ్డు పనులను  దత్తప్ప స్వామి పూజలు చేసి, మద్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, దార్సవార్ సాయిలు ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. గ్రామభివృద్ధి కి ఇంకా కొన్ని పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొండ వార్ గంగాధర్ , అవల్ గావ్  కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు ప్రమోద్ పాటిల్, మాజీ సర్పంచ్ బోండ్ల వార్ మారుతీ, ఉప సర్పంచ్ కీసర్ వార్ మారుతీ, గ్రామ పెద్దలు, సదాశివ్ పాటిల్, వినోద్ పాటిల్, అమూల్, రవి, దత్తప్ప, బాబు పటేల్, రాజురే ఆనంద్, సంజు మేస్త్రి, ఈరన్న, కైలాష్, పుండ్లిక్,హన్మండ్లు , ఖండు, బలిరామ్, ద్రోణచారీ, విజయ్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

More articles

Latest article