30.9 C
Hyderabad
Monday, August 3, 2026

పసుపు బోర్డు తెచ్చానంటున్న ఎంపీ అర్వింద్ రైతులను పరామర్శించడం లేదు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: పసుపు బోర్డు తీసుకొచ్చానంటున్న ఎంపీ అర్వింద్ పంట ధర తగ్గినా రైతులను పరామర్శించడం లేదని, బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనం చేకూరడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పసుపుకు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో బండి సంజయ్ చెప్పినప్పటికీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి పసుపు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? ప్రభుత్వం ఏం చేస్తోంది? అని ప్రశ్నించారు. క్వింటాల్ పసుపునకు రూ.15వేల ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీరేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ.. ప్రస్తుతం కనీసం రూ.9వేల రావడం లేదన్నారు. ఇది రైతులను మోసం చేయడమేనని, వెంటనే రూ.15వేల ధర చెల్లించి పసుపు కొనుగోలే చేయాలన్నారు.

More articles

Latest article