24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రజావాణి అర్జీలను పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, బతుకమ్మ : ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండుపడక గదుల ఇళ్లు మంజూరు, రైతు భరోసా, మున్సిపల్ వార్డుల్లో పారిశుధ్య కార్యక్రమాలు, మున్సిపల్ రోడ్లు ఆక్రమణ, తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. సోమవారం

Public complaints should be resolved.

ప్రజావాణి లో (101) ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన అర్జీలను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెండింగులో ఉన్న అర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తు దారునికి సమాచారం అందించాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ సీఈవో చందర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Public complaints should be resolved.1258

More articles

Latest article