24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ సామాజిక న్యాయం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని పాటించిందని, అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ చైర్మన్ కేతావత్ యాదగిరి అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి ఎంపికతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సమప్రాధాన్యత దక్కిందని అన్నారు. దేశంలోని ఏ రాష్ర్టంలో లేని విధంగా కుల గణన చేపట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ ఆదేశాల మేరకు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సూచనలతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ర్టంలో కులగణన చేపట్టి అన్ని వర్గాలకు న్యాయం చేసేలా పని చేస్తున్నారన్నారు.

ఇది కూడా చదవండి: మైనారిటీని మరిచారా..?

పార్టీని నమ్ముకున్న వారికి పదవులు దక్కుతాయనేందుకు శంకర్ నాయక్ ఎంపిక నిదర్శనమని, సామాన్య కార్యకర్తగా, నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శంకర్ నాయక్ కు ఎమ్మెల్సీ పదవి దక్కడం గిరిజనులకు దక్కిన గౌరవమని అన్నారు. బీసీ నాయకుడు మహేశ్ కుమార్ గౌడ్ ను పీసీసీ అధ్యక్షుడిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కు ధన్యవాదులు తెలుపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన గిరిజనులకు కూడా పార్టీ సముచిత స్థానం కల్పించాలని యాదగిరి కోరారు. విలేకరుల సమావేశంలో మోపాల్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బున్నె రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article