ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ సామాజిక న్యాయం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని పాటించిందని, అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ చైర్మన్ కేతావత్ యాదగిరి అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి ఎంపికతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సమప్రాధాన్యత దక్కిందని అన్నారు. దేశంలోని ఏ రాష్ర్టంలో లేని విధంగా కుల గణన చేపట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ...