బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని గాండ్ల పెట్ గ్రామంలో గల గ్రామపంచాయతీ నందు సోమవారం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కు సంబంధించిన 16వ విడత సామాజిక తనిఖీ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇట్టి గ్రామ సభకు గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీడీవో తిరుమల దేవి హాజరై అర్హులందరికీ పని కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజయ్, ఫీల్డ్ అసిస్టెంట్ సంతోష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
