23.4 C
Hyderabad

వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ:  జిల్లాలో వడ్డీ వ్యాపారి వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. సిరికొండ మండలం ముషీర్ నగర్ కు చెందిన మనోహర్ అనే వ్యక్తి కొద్దికాలంగా నగరంలో డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన అవసర నిమిత్తం నగరంలోని నాందేవ్ వాడకు చెందిన  జ్యోతి అనే మహిళ వద్ద ఆరు నెలల క్రితం రూ. 40 వేలు అప్పుగా తీసుకున్నాడు. అసలు, వడ్డీ కలిపి రూ. 80 వేల చెల్లించాలని సదరు మహిళ మనుషులు మనోహర్ ను వేధింపులకు గురిచేశారు. అంతేకాకుండా అతడి మొబైల్ ను వారు తీసుకెళ్లారు.  దీంతో మనస్తాపానికి గురైన మనోహర్ గడ్డి మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ జిల్లా ఆస్పత్రిలో ఆదివారం రాత్రి మృతి చెందాడు.

More articles

Latest article