- విద్యార్థి కి వాతలు తేలేలా కొట్టిన వైనం
- ఉపవాసం ఉన్న విద్యార్థిని కొట్టినందుకు నిలదీసిన కుటుంబ సభ్యులు
- పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ కాలేజీలో రెసిడెంట్ విద్యార్థిపై వార్డెన్ దాడి చేశాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన వాహజుద్ధిన్ (17) ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షల నేపథ్యంలో వాహజుద్ధిన్ హాస్టల్ లో ఉండి చదువుతున్నాడు. చదువకుండా నిధ్ర పోతున్నాడని ఆదివారం హాస్టల్ ఫ్లోర్ ఇంచార్జీ నిఖిల్ అనే వార్డెన్ కొట్టడంతో గాయాలు

అయ్యాయి. తాను రంజాన్ మాసం సందర్భంగా ఉపవాసం( రోజా) ఉండి చదువుతుండగా తనను అకారణంగా కొట్టడని వాహజుద్ధిన్ తల్లిదండ్రులకు ఫోన్ లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు హాస్టల్ కు వచ్చి ప్రిన్సిపాల్ తో పాటు వార్డెన్ లను నిలదీశారు. అప్పటికే వార్డెన్ ను అక్కడినుంచి పంపించేశారు. అయితే కుటుంబ సభ్యులు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్థానికంగా ఉన్న ప్రిన్సిపాల్ హన్మంత్ రావు ను వివరణ కోరగా హాస్టల్ లో ఎలాంటి ఘటన జరుగలేదని చెప్పడం విశేషం.

