28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మోర్తాడ్ లో బిజెపి సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  రెండు స్థానాలు బిజెపి విజయం సాధించినందుకు మోర్తాడ్ మండల బిజెపి అధ్యక్షులు పుప్పాల నరేష్ ఆధ్వర్యంలో గురువారం బిజెపి నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పుప్పాల నరేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలని భారతీయ జనతా పార్టీకి కట్టబెట్టడం తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఒక నిలువెత్తు నిదర్శనం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని స్థితిలో ఉందని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల నెరవేరుస్తుంది అని నమ్మకం ప్రజలలో లేదు. కాబట్టి మరోవైపు మోడీప్రభంజనం  ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి సాధించి తీరుతదని ఉద్దేశంతోనే  బిజెపిని స్వాగతిస్తున్నారు. ఈ విజయం పట్ల నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా ఇది ఒక కార్యకర్త గెలుపు ఇది యావత్ తెలంగాణ పట్టబదుల గెలుపు ఇది యావత్ తెలంగాణ ఉపాధ్యాయుల గెలుపు అదేవిధంగా ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్త గెలుపు  బిజెపి రోజురోజుకు తెలంగాణలో భలపడుతోందనడానికి ఎన్నికలే నిదర్శనమే నేటి ఎన్నికల ఫలితం, అదేవిధంగా రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకొని తీరుతుందని ప్రజల ఆదరణ కేవలం భారతీయ జనతా పార్టీ పైనే ఉందని కాబట్టి స్థానిక ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉండాలని అన్నారు.  కార్యక్రమంలో సీనియర్ నాయకులు బోగ దేవేందర్, తీగల రమేష్ రెడ్డి, ఏలేటి సాయన్న, తక్కురి సాగర్, బొడిదే మోహన్, వెంచిర్యాల గంగారెడ్డి, జెడి చిన్నారెడ్డి, కోరం ప్రకాష్, రాము గౌడ్, లక్ష్మీ నరసయ్య,  శేఖర్, దేవేంధర్, గంగారెడ్డి, సాగర్, శశి వెంకటేష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article