మోర్తాడ్ లో బిజెపి సంబరాలు
బతుకమ్మ,మోర్తాడ్: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు బిజెపి విజయం సాధించినందుకు మోర్తాడ్ మండల బిజెపి అధ్యక్షులు పుప్పాల నరేష్ ఆధ్వర్యంలో గురువారం బిజెపి నాయకులు కార్యకర్తలు సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పుప్పాల నరేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలని భారతీయ జనతా పార్టీకి కట్టబెట్టడం తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఒక నిలువెత్తు నిదర్శనం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని స్థితిలో ఉందని...