24 C
Hyderabad
Sunday, August 2, 2026

భిక్కనూరులో బీజేపీ సంబురాలు

Must read

📰 Generate e-Paper Clip

భిక్కనూరు, బతుకమ్మ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు మల్క కొమురయ్య, చిన్నమైల్ అంజిరెడ్డి విజయాన్ని హర్షిస్తూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు భిక్కనూరులో గురువారం సంబురాలు చేసుకున్నారు. చౌరస్తాలో పటాకులు కాల్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాబోయే కాలంలో తెలంగాణలో పూర్తిస్థాయిగా బిజెపి జెండా ఎగరవేయడానికి ప్రతి కార్యకర్త కృషిచేస్తామని అన్నారు. కార్యక్రమంలో  బీజేపీ మండల అధ్యక్షుడు రమేశ్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

More articles

Latest article