27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

నిజాంసాగర్, బతుకమ్మ: మండల కేంద్రానికి చెందిన అంద్యాల హరికుమార్(26) అనే వ్యక్తి నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన హరికుమార్, మధ్యాహ్నం సమయంలో అతడు నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకుతుండగా బంజేపల్లికి చెందిన వ్యక్తి చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. సోమవారం ఉదయం హరికుమార్ మృతదేహం నీటిపై తేలడంతో పోలీసులు బయటికి తీయించారు. మద్యానికి బానిసైన హరికుమార్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More articles

Latest article