జైపూర్, బతుకమ్మ: మహా కుంభ మేళా వేదికగా సోషల్ మీడియాతోపాటు ఎలక్ర్టానిక్ మీడియాలో హల్ చల్ చేసి ఐఐటీ బాబా అభయ్ సింగ్ వివాదాలకు కేంద్రంగా మారుతున్నారు. తాజాగా గంజాయి కేసులో రాజస్థాన్ లోని జైపూర్ పోలీసులు ఐఐటీ బాబాను అరెస్ట్ చేశారు. ఓ హోటల్ లో ఐఐటీ బాబా గొడవ చేస్తున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో బాబా వద్ద గంజాయి లభించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిర్ణీత మొత్తంలోనే గంజాయి ఉండటంతో ఆ తరువాత విడుదల చేశారు.
