29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కిషన్ రెడ్డి దేనికి ఎట్లా అడ్డం పడ్డాడో చెప్పాలి

Must read

📰 Generate e-Paper Clip

  • నిజామాబాద్ ఎంపీ అరవింద్
  • సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎంపీ అరవింద్ కౌంటర్

నిజామాబాద్, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ స్పందించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దేనికి ఎట్లా అడ్డం పడ్డాడో చెప్పాలన్నారు. కిషన్ రెడ్డి ఏ ప్రాజెక్టుకు అడ్డం పడ్డాడో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులను  పంపిస్తే తాను కిషన్ రెడ్డిని ఒప్పించి మోదీ దగ్గరకు తీసుకెళ్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపునా ఇవ్వాల్సిన ల్యాండ్, షేర్ ఆఫ్ ఫండ్స్ ఇస్తున్నావా అని ప్రశ్నించారు. నీ టీంను పంపిస్తే కిషన్ రెడ్డిని తాను ఒప్పించి మోదీ దగ్గరకు తీసుకొస్తానని తెలిపారు. పనికి మాలిన రాజకీయాలు చేస్తు ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమైనాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిడుతున్నారని అన్నారు. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లోకి వస్తే మహిళలు చీపుర్లతో సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సొల్లు పురాణాలు చెబుతున్నాడని అన్నారు.

More articles

Latest article