30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

నీటి సమస్య పరిష్కరించాలని ప్రజావాణి లో వినతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని జెండా గల్లి లో నీటి సమస్య పరిష్కరించాలని ఆర్టిఐ జిల్లా ప్రతినిధి గంగుల రవీందర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ప్రజావాణికి వెళ్లి నీటి సమస్యపై ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత కొంత కాలం నుండి నీటి సమస్య ఎదుర్కొంటున్నామని గతంలో గ్రామపంచాయతీ సెక్రటరీ మహేష్ కుమార్ కు వినతిపత్రం అందజేసిన పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రజావాణిలో వినతిపత్రం అందజేశామని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నీటి సమస్యపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సందీప్, రాకేష్, రాజశేఖర్ గ్రామ ప్రజలు ఉన్నారు.

More articles

Latest article