బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలం మోటట్ పల్లిగ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోటాటి రాజేశ్వరి – రాజిరెడ్డి కుమారుడి వివాహానికి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదివారం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో విండో చైర్మన్లు నల్లవెల్లి అశోక్, వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సాయి రెడ్డి, అంద్యాల రమేష్, రాజయ్య బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
