24 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రాణం తీసిన పేకాట

Must read

📰 Generate e-Paper Clip

సెల్ ఫొన్ తాకట్టు పెట్టి ఆడిన యువకుడు

జగిత్యాలలో అనుమానాస్పద స్థితిలో మృతి

జగిత్యాల, బతుకమ్మ : పేకాట వ్యసనం ఓ యువకుడి ప్రాణం తీసింది. ఈఘటన జగిత్యాల పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన షేక్ రఫీ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం డబ్బులు అయిపోవడంతో సెల్ ఫొన్ తాకట్టు పెట్టి కొందరు వ్యక్తులతో పేకాట ఆడాడు. ఈక్రమంలో రఫీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గంజాయి మత్తులో రఫీని హత్య చేశారని కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article