27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

జిల్లా సైన్స్ టాలెంట్ టెస్ట్ లో సత్తా చాటిన మెండోరా స్కూల్

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : జాతీయ సైన్స్ దినోత్సవం సందర్బంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన సైన్స్ టాలెంట్ టెస్ట్ లలో భాగంగా నిర్వహించిన వ్యాస రచన పోటిల్లో మండలంలోని మెండోరా హై స్కూల్ సత్తా చాటింది. ఈ పాఠశాలలో 9వ తరగతికి చెందిన ఎం. డీ సోన వ్యాస రచన పోటీలో పాల్గొని రెండవ స్థానంలో నిలిచింది.జిల్లా కేంద్రంలోని నిర్మల్ హృదయ స్కూల్ లో నిర్వహించిన ఈ టాలెంట్ ప్రోగ్రాం లో జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రయివేట్ స్కూల్ విద్యార్థులు పాల్గొనగా సోన తన ప్రతిభను చాటి రెండవ స్థానంను కైవసం చేసుకొంది.రన్నార్ గా నిలిచిన సోనను, గైడ్ టీచర్ గంగమోహన్ లను రూ. 2000 నగదు బహుమతి, మెమంటోలను అందజేసి సత్కరించారు.విజేత సోనను మండల, గ్రామ ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమం లో జనవిజ్ఞాన వేదిక డీ ఈ ఓ అశోక్,డీఎస్ ఓ గంగకిషన్,నర్రా రామారావు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article