28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘరానా దొంగ అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

  • మూడు లక్షల 20వేల నగదు, 19 తులాల బంగారం,  500 గ్రాముల సిల్వర్ స్వాధీనం
  • వివరాలను వెల్లడించిన ఏసిపి రాజా వెంకట్ రెడ్డి

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  పుట్టిపెరిగింది వరంగల్. 15 సంవత్సరాలుగా దొంగతనం చేయని ప్రాంతం లేదు. 85 దొంగతనాలు, ఒక పీడీయాక్టు నమోదైన వెనక్కి తగ్గింది లేదు. అతడి చేయి పడితే ఎటువంటి ఇళ్ళు అయిన గుల్ల కావాల్సిందే. నిజామాబాద్ నగరంలో మహాశివరాత్రి నాడు ఉదయం వేళ తాళాలు వేసిన ఇళ్ళను చోరి చేసిన ఘరానా దొంగను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. శనివారం ఏసీపీ కార్యాలయంలో ఏసిపి రాజా వెంకట్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శనివారం ఉదయం నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లోని బైపాస్ రోడ్ లో వాహనాలు తనిఖీలు నిర్వహించగా అనుమాదాస్పదంగా ఓ వ్యక్తి బ్లూ కలర్ హోండా యాక్టివా పై నిజామాబాద్ వైపు వస్తుండగా రూరల్ పోలీస్ సిబ్బంది అతన్ని ఆపి తనిఖీ చేయగా పని వద్ద నగదు, బంగారం,వెండి,స్క్రూ డ్రైవర్,ఇనుప సుత్తి కనిపించడంతో వెంటనే అతన్ని విచారించగా గత నెల 27వ తేదీన మూడు ఇళ్లలో చోరికి పాల్పడినట్టు ఒప్పుకున్నారని ఎసిపి తెలిపారు. వరంగల్ ప్రాంతానికి చెందిన సయ్యద్ అమీద్ అనే వ్యక్తి హైదరాబాద్ లో నివాసము అంటూ పలు ప్రాంతాలలో చోరీకి పాల్పడ్డాడు దొంగతనాలకు పాల్పడ్డాడని తెలిపారు. ఇతనిపై ఇప్పటివరకు కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఫిబ్రవరి 27 న శివరాత్రి పండగ రోజున పట్టపగలే నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ,గంగస్థాన్ ఫేస్ 3,ఏకశిలా నగర్,ప్రాంతాలలో ఉన్న బాధితులు ఇంటికి తాళం వేసి గుడికి వెళ్ళగా,ఇదే అదునుగా భావించిన నిందితుడు సయ్యద్ ఆమీద్ మూడిళ్లలో చోరికీ పాల్పడి రూ.3.20.000 నగదు,19 తులాల బంగారం,500 గ్రాముల వెండి దోచుకెళ్ళాడని,బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  సౌత్ ,నార్త్ , రూరల్ పోలీసులు ఏసిపి ఆదేశాల మేరకు కేసుని కేసును సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా దొంగతనం జరిగిన ప్రాంతాలలో సిసి ఫుటేజీలను పరిశీలించిన తరువాత నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని,నిందితుడు గత 15 సంవత్సరాల నుంచి దొంగతనాలకు పాల్పడుతుండే వాడని గతంలో చందానగర్,నిజామాబాద్,బోధన్,రెంజల్,సరూర్ నగర్,ఎడపల్లి తో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ఇతనిపై దాదాపుగా 85 కు పైగా కేసులు ఉన్నాయని,2018 ఇతనిపై నాచారం పోలీస్ స్టేషన్ లో పీడీ యాక్ట్ కూడా నమోదయిందని తెలిపారు. 48 గంటల్లో దొంగతనం కేసును చాకచక్యంగా చేదించిన నార్త్ సిఐ,సౌత్ సిఐ,నిజామాబాద్ రూరల్ ఎస్ ఐ,మాట్లూర్ ఎస్ ఐ సిబ్బందిని ఏసీబీ అభినందించారు. వీరికి త్వరలోనే రివార్డును ప్రకటిస్తామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సౌత్ రూరల్ సీఐ సురేష్,నార్త్ సిఐ శ్రీనివాస్,రూరల్ ఎస్ ఐ ఆరిఫ్,మాక్లూర్ ఎస్ ఐ పాల్గొన్నారు.

More articles

Latest article