24 C
Hyderabad
Sunday, August 2, 2026

కిలాడీ లేడీ అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

  • 5తులాల బంగారు నగలు స్వాధీనం

 

బతుకమ్మ, బిచ్కుంద :  బిచ్కుంద బస్ స్టాండ్  నుంచి వెళ్లే బస్సులలో ప్రయాణిస్తు వరుసగా మహిళల మెడలో నుంచి బంగారు నగలను దొంగతనం చేస్తున్న మహిళను పట్టుకున్నట్లు బిచ్కుంద సీఐ జగడం నరేష్ తెలిపారు. బిచ్కుంద సర్కిల్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.  కర్ణాటక రాష్ట్రంలోని ఔరద్ తాలుకాలో గల కమల్ నగర్ లో  శాంతాబాయి  మధుకర్ కాంబ్లే అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె బిచ్కుంద  బస్ స్టాప్ కు వచ్చి రద్దీగా ఉన్న బస్సుల వద్దకు వెళ్లి ప్యాసింజర్ లతో కలిసి ఎక్కుతున్నట్లుగా బస్సు ఎక్కుతూ మహిళ  మెడలో ఉన్న బంగారు నగలను దొంగిలించేది. అక్కడి నుంచి ఆటో స్టాండ్ కి వెళ్లి ఆటో ఎక్కి జుక్కల్ చౌరస్తా నుండి ఆనేగావ్ మీదుగా కమల్ నగర్ కు చేరుకునేది. బిచ్కుంద బస్ స్టాప్ నుండి ఇప్పటివరకు గోడమీది సాయవ్వ, గాండ్ల సాయవ్వ, దోమటి శకుంతల, సాయవ్వ వారి మెడలో నుండి  మొత్తం 5 తులాలు బంగారు నగలను వారి మెడలో నుండి బంగారు నగలను దొంగలించింది. ఇదే క్రమంలో నగలను దొంగిలిస్తుండగా శాంతాబాయిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని విచారించగా తానే నగలను దొంగిలించినట్లు అంగీకరించింది. ఆమె  వద్ద నుంచి 5తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జ్యుడీషియల్ రిమాండ్ కు పంపినట్లు సీఐ తెలిపారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ నదీమ్ ను, బిచ్కుంద పోలీస్ సిబ్బందిని ప్రశంసించారు.

More articles

Latest article