26.3 C
Hyderabad
Monday, August 3, 2026

నలంద కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : నలంద కళాశాలలో శనివారం ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత చదువులకు ఇంటర్మీడియట్ తొలిమెట్టు అని కళాశాల ప్రిన్సిపాల్ సంగ్రామ్ నాయక్ అన్నారు.ప్రతి పనిలోనూ పట్టుదలతో ముందుకు నడిస్తే విజయం తానుగా సొంతమవుతుందన్నారు. విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా ఆసక్తికరమైన అంశాన్ని ఎంచుకొని దానిని సాధించే దిశగా కృషి చేయాలని, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా జీవితాన్ని మలుచుకోవాలని సూచించారు.  కళాశాల విద్య చాలా ఉన్నతమైనదని భవితరాలకు పునాది వేస్తుందని ఆదర్శప్రాయంగా కృషి చేస్తూ,  నిర్దేశించిన లక్ష్యాలను అందుకొని మైలురాళ్లు  దాటి విజయానికి నిర్వచనం గా ఉండాలని, ఎటువంటి ఒత్తిడి లేకుండా ఇంటర్ పరీక్షలు అద్భుతంగా రాసి సంచలన విజయాలను నమోదు చేయాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతి  కార్యక్రమాలు నిర్వహించి కేరింతలతో హోరెత్తించారు.  కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ తో పాటు, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

A grand farewell meeting at Nalanda College

More articles

Latest article