బతుకమ్మ,ఏర్గట్ల: తడపాకల్ జెడ్ పి హెచ్ఎస్ స్కూల్లో సివి రామన్ జన్మదిన సందర్భంగా శుక్రవారం సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో సైన్స్ విభాగానికి చెందిన విద్యార్థులు ఎంతో ముందుండాలని, ప్రపంచాన్ని శాసించే సత్తా సైన్స్ సబ్జెక్టుకు మాత్రమే ఉందని సైన్స్ యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. ఈ సందర్భంగా సైన్స్ ఉపాద్యాయులు రామిండ్ల రవి ని సన్మానించారు. పాఠశాలల్లోని విద్యార్థిని విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించి గెలుపొందిన జట్టుకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సుధాకర్, ఉపాద్యాయులు గైని గంగాధర్, ఇప్ప రాములు, రవి, స్వప్న, నవీన్, చక్రపాణి, దేవానంద్ గౌడ్, భూపతి, ఆనంద్, విజయ, కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.
