- డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రుణాల ఏకకాల పరిష్కార పథకాన్ని సద్వనియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్ రమేశ్ రెడ్డి తెలిపారు. గత రెండున్నర సంవత్సరాలుగా దీర్ఘకాలిక ఋణాల చెల్లింపు కాల పరిమితి ముగిసిన ఋణములకు ఏకకాల పరిష్కార పథకము రూపొందించబడిన విషయం తెలిసిందేనన్నారు. ఈ ప్రస్తావన సంవత్సరంలో ఏకకాల పరిష్కార పథకంలో భాగంగా వాయిదా మీరిన వడ్డిలో 40శాతం వడ్డీ రాయితీ, అపరాధ వడ్డీ లో 100శాతం వడ్డీ రాయితీ వెసులుబాటు కల్పించబడిందని తెలిపారు. ఈ అవకాశం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా బట్వాడా చేయబడిన దీర్ఘ కాలిక ఋణాలకు, నేరుగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా బట్వాడా చేయబడిన నాన్ ఫామ్ సెక్టర్, స్వయం సహాయక సంఘాలు, జాయింట్ లయబిలిటి గ్రూప్ లు, దీర్ఘకాలిక మార్టిగేజ్ ఋణాలకు వర్తింస్తుందని తెలిపారు. ఈ ఏకకాల పరిష్కార పథకం వినియోగించుకోవడానికి మార్చి 31 చివరి తేదీ అని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు దగ్గరలోని సహకార సంఘాన్ని కాని జిల్లా కేంద్ర సహకార బ్యాంకును కాని సందర్శించాలన సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులందరికీ సన్నరకం వడ్లకు క్వింటాల్ నకు రూ.500బోనస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలలోకి జమ చేయడం జరిగినదని తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత లేదని రైతులందరూ ప్రస్తుతం గల యూరియా స్టాక్ ను పొదుపు గా వాడుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో బ్యాంకు ఉపాధ్యక్షులు నల్ల చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్ లింగయ్య పాల్గొన్నారు.
