27.5 C
Hyderabad
Friday, July 31, 2026

మిగిలింది రెండు గంటలే..

Must read

📰 Generate e-Paper Clip

. పట్టభద్రుల నియోజకవర్గ పోలింగ్ శాతం 40.61

. టీచర్ల పోలింగ్ శాతం 63.49

Only two hours left..

నిజామాబాద్, బతుకమ్మ: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2గంటల వరకు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 40.61శాతం పోలింగ్ నమోదు కాగా, టీచర్ల నియోజకవర్గానికి 63.49శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగనుంది. మొత్తం గ్రాడ్యుయేట్లు 3,55,159 మంది కాగా, 1.44,216 మంది ఓటేశారు.  టీచర్ ఓటర్లు 27,088 మందికిగాను 17,198 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

హుస్నాబాద్ లో ఘర్షణ

హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి పోలింగ్ స్టేషన్ సమీపంలోనే కాంగ్రెస్ నాయకులు వాహనంలో బహిరంగంగా డబ్బులు పంచుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలో  కాంగ్రెస్, బిజెపి నేతల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది.

Only two hours left..

More articles

Latest article