25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్, బతుకమ్మ:

కరీంనగర్ -నిజామాబాద్- మెదక్-ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఓటింగ్  ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. మహశివ రాత్రి  జాగరణ నేపథ్యంలో ఉదయం వేళ ఓటర్లు లేక పోలింగ్ కేంద్రాలు వేల వేలబోయాయి.  గ్రాడ్యూయేట్ ఓటర్ల కోసం 499, ఉపాధ్యాయ ఓట్ల కోసం 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది అధికార యంత్రాంగం. పట్ట భద్రుల నియోజకవర్గంలో 56 మంది, టీచర్స్ ఎమ్మెల్సీ కోసం 15 మంది బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

 

Polling for MLC election has started బుధవారం వరకు ఓటుకు నోటు తాయిలాల పంపిణీ గుట్టు చప్పుడు కాకుండా జరిగింది. రాత్రికి రాత్రే సమీకరణలు మారి  విద్యా వ్యాపారవేత్తలు వర్సెస్ కామన్ మ్యాన్ అనే నినాదంతో చర్చ మొదలైంది. కోందరు కులం కార్డు ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్న వారి వెనుక ఉన్న పార్టీల గుట్టు రట్టైంది. గురువారం సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ అవకాశం ఉండగా, మార్చి 3న ఫలితాలు వెలువడనున్నాయి.

 

Polling for MLC election has started

More articles

Latest article