25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

అంతా ఓం నమశ్శివాయం

Must read

📰 Generate e-Paper Clip

. . . ఎక్కడ చూసినా పరమేశ్వరుని నామస్మరమే

. . . ఆలయాలకు లైటింగ్ లతో సుందరీకరణ

. . . ప్రొద్దున నుండి పూజలతో హోరోత్తుతున్న భక్తులు

. . . ఆనందోత్సాహాలతో ఆలయాల్లో భక్తులతో కిటకిట

ఇందల్వాయి, బతుకమ్మ : 

ఇందల్వాయి మండలంలోని వివిధ గ్రామాలలో శివాలయం, దేవాలయ మందిరలలో దేవాలయ కమిటి,విడిసి కమిటి, స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన యువకుల కమిటీలు, గ్రామస్తుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవంను అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిపారు.ఆలయల చుట్టు లైటింగ్ లతో చూడచక్కగా సుందరీకరించారు.గుడిపైన వేసిన లైట్లు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.భక్తులు ప్రొద్దున నుండి ఉపవాస దీక్షలు చేపట్టి శివనామస్మరణలతో పరమేశ్వరుని దర్శించుకున్నారు. ఇందల్వాయి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి మందిరం వద్ద మహాశివరాత్రి సందర్భంగా అన్నదాన నిర్వహించారు.చుట్టు ప్రక్కల గ్రామాల భక్తులతో ఆలయ ప్రాంగాణలు మొత్తం శివ నామస్మరణతో మార్మోగింది. అనంతరం పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు గ్రామాలలో నేడు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.భక్తులు అన్నదాన కార్యక్రమానికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Everything is Om Namashivayam

More articles

Latest article