బతుకమ్మ, మోర్తాడ్ :
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్ధన్నపేట్ ఎమ్మెల్యే నాగరాజు మంగళవారం ప్రచారం నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలో ప్రచారంలో భాగంగా ప్రైవేట్ టీచర్లను, ప్రైవేటు సంస్థలు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను కలసి ప్రచారం చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీ గిర్మాజి గోపి, మోర్తాడ్ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు, మహిపాల్, రమేష్, నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు.
