29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

సీఎం పర్యటన సందర్భంగా నేతల ముందస్తు అరెస్టు

Must read

📰 Generate e-Paper Clip

నిజామబాద్, బతుకమ్మ : జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా  పోలీసులు పలువురు నేతలను ముందస్తు అరెస్టు చేశారు.  పీడీఎస్ యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నరేందర్, డాక్టర్ కర్క గణేశ్, జిల్లా కోశాధికారి నిఖిల్, సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ ఏరియా సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ లు ఉన్నారు. ఈ సందర్భంగా పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా  మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో నిజామాబాద్ జిల్లాకు విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చలేదని ఆరోపించారు. జిల్లాకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాలను మంజూరు చేసి నిజామాబాద్ ని విద్యా హబ్ గా మారుస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పీసీసీ అధ్యక్షులు, పార్టీ సలహాదారులు,మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ జిల్లా విద్యార్థుల ఆకాంక్షలను నెరవేర్చడంలో మాత్రం నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు. విద్య శాఖ సీఎం వద్ద ఉన్నా ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, మెస్ బకాయిలు చెల్లించకపోవడం సిగ్గుచేటున్నారు. నిరుద్యోగ యువకుల సమస్యలు పరిష్కరించకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఇటువంటి అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.

More articles

Latest article