25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

27న ప్రత్యేక సాధారణ సెలవు

Must read

📰 Generate e-Paper Clip

కరీంనగర్, బతుకమ్మ: ఉమ్మడి నిజామాబాద్ – మెదక్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ పోలింగ్ నేపథ్యంలో ఈనెల 27వ తేదీన ప్రత్యేక సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ  ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి పమేలా సత్పత్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ విద్యాలయాలు, సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు సాధారణ సెలవుదినం వర్తిస్తుందని, వివిధ ప్రైవేట్ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి పోలింగ్ రోజున ఆలస్యంగా రావడానికి లేదా షిఫ్ట్ లు మార్చుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను పాటించని వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

More articles

Latest article